
వీణవంక,(కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని ఎల్బాక గ్రామంలో శ్రీ ప్రణవ ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న
శ్రీ కృష్ణ మందిర ఆలయ నిర్మాణానికి
శ్రీ ప్రణవ ఆశ్రమ సత్యం గురూజీ ఆశ్రమ పూజారి రామానంద చారి ఆశ్రమ కమిటీ సభ్యులు
పాడి ఉదయ్ నందన్ రెడ్డి ని కలిసి శ్రీ ప్రణవ ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న
శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం గురించి సనాతన హిందూ ధర్మం పరిరక్షణ హిందూ ధర్మ ప్రచారం లక్ష్యంగా ఆలయ నిర్మాణం జరుగుతుందని వివరించిన వెంటనే
శ్రీ ప్రణవ ఆశ్రమంను సందర్శించి పాడి ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ… బాల్యం నుంచే పిల్లలకు భగవద్గీత నేర్పించడం హిందూ సంప్రదాయాలను గౌరవించడం బాల్యం ఉండే సరైన నడవడిక ఉంటుందని సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆలయ నిర్మాణంలో భాగంగా తన వంతు విరాళంగా తన అనుచరులచే 20,000/- ఇరువై వేల రూపాయలను ప్రణవఆశ్రమ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో
ప్రణవ ఆశ్రమ అధ్యక్షులు మందాటి లక్ష్మారెడ్డి, వీణవంక మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, వీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు ఎం డి అబ్దుల్ హమీద్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య, వెన్నంపల్లి నారాయణ, మంతెన శ్రీధర్,నల్ల పుల్లారెడ్డి , కొత్తిరెడ్డి శంకర్ రెడ్డి , నారాయణరెడ్డి, వీరారెడ్డి, కోమల్ రెడ్డి, కొండల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సమీడ్లచిట్టీ,దాసారపు లోకేష్, వంశీకృష్ణ, అశోక్,తాళ్లపెల్లి కుమారస్వామి,చిన్నాల శ్రీకాంత్,బుర్ర సాగర్, తోట్ల రాకేష్, ఉమేష్, కోరే రాకేష్, ఎల్బక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.