రైతులు కంది పంట కొనుగోలు కేంద్రన్ని సద్వినియోగం చేసుకోవాలి
◆-: డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో మార్క్ ఫెడ్, నాఫెడ్ సౌజన్యంతో డీసీఎంఎస్ పర్యవేక్షణలో సిడిసి చైర్మన్ మొహమ్మద్ ముబిన్, ఆత్మ కమిటీ చైర్మన్ లు కలిసి కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కందులకు క్వింటాల్ ధర 8 వెయ్యిల రూపాయలు నిర్ణయించిందని, ఈ యొక్క కొనుగోలు కేంద్రం రైతులకు 2 నెలల పాటు అందుబాటులో ఉంటుందని, 12 శాతం తేమతో ఉండాలని అన్నారు. అధికారులు సూచించిన ప్రమాణాలను పాటించి అధిక మట్టిని కలిగి ఉండకూడదని, ఎక్కువ శాతంలో గింజలు రంగు మారకుండా ఉండేవిధంగా రైతులు జాగ్రత్తలు పడాలని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినందున రైతులు ఈ స్వర్ణ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని, రైతులు కొనుగోలు కేంద్రానికి పంటను అమ్మిన వెంటనే అధికారులు నేరుగా రైతుల ఖాతాలో డబ్బులను జమ చేస్తారని అన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ సంచాలకులు భిక్షపతి, మండల వ్యవసాయ అధికారి లావణ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, మార్కెట్ సెక్రెటరీ చంద్రశేఖర్ పాటిల్, సెంటర్ నిర్వాహకులు దత్తు పాటిల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
