Paddy Procurement Centers Open in Veenavanka
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.
