వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
దేవరకద్ర /నేటి ధాత్రి
దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి, హజీలపూర్, చౌదర్ పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. గ్రేడ్-ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాకు రూ.2,300 మద్దతు ధర ఇస్తామని, సన్నరకం ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు. రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.