
PACS Chairman
రెండోసారి పొడగించిన పిఎసిఎస్ చైర్మన్ పదవి,
– మరో ఆరు నెలలు పొడగింపు.
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
– నేటి ధాత్రి, మొగుళ్ళపల్లి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార సంఘాలతో పాటు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాలను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, రెండోసారి మొగుళ్ళపల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ గా సంపెల్లి నరసింగరావు వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్ తో పాటు 11 మంది డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నారు. గతంలో 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించగా. ఐదు సంవత్సరాల కాలం పాటు పాలకవర్గం కొనసాగింది. పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు పాలకవర్గాన్ని కొనసాగింపు చేసింది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సొసైటీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రభుత్వం రెండవసారి పాత పాలకవర్గాన్నే కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది,