#ఎట్టకేలకు రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు.
#రైతు బాధలను వెలుగులోకి తీసుకువచ్చిన నేటిధాత్రి కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.
నల్లబెల్లి, నేటిధాత్రి: గత పది రోజులుగా నేటి దాత్రి సంచికలో రైతుల కోసం అనునిత్యం ప్రచురణ వార్తలు రావడంతో అధికారులతో పాటు, పి ఏ సి ఎస్ చైర్మన్ స్పందించి రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చారు మండలంలోని పలువురు డీలర్లు ఇష్ట రాజ్యాంగ యూరియాకు పురుగుమందు లింకు పెడుతూ అమ్మడం జరిగింది. దీనిని నేటి ధాత్రి ప్రతినిధి వెలుగులోకి తీసుకురాగా పలువురు డీలర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ రైతుల సంక్షేమమే అనే దిశగా నేటి ధాత్రి ప్రతినిధి ఎవరి బెదిరింపులను లెక్కచేయకుండా రైతులకు అండగా నిలుస్తూ వారికి భరోసా కల్పించారు. ప్రత్యేక చొరవతో పి ఎస్ ఎస్ చైర్మన్ తో మాట్లాడి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని వారిని కోరగా స్పందించిన చైర్మన్ మరుసటి రోజే యూరియాను తెప్పించి రైతులకు అందించడంతో రైతులు వారి పక్షాన నిలబడిన నేటి దాత్రి కు కృతజ్ఞతలు తెలియజేశారు.