
శునకాల గుంపులు.. ఆందోళనలో పట్టణ ప్రజలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు విలీన గ్రామాల ప్రజలు వీధి కుక్కల వల్ల తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆర్డిఓ రామ్ రెడ్డి గారికి వారి కార్యాలయంలో కలిసి బి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు ,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నామ రవికిరణ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లపై వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర్య విహారం చేస్తున్నాయని, పట్టణంలోని పలు ప్రదేశాలలో వీధి కుక్కలు చిన్న పిల్లలపై దాడులు సైతం చేశాయని అన్నారు.. వీధి కుక్కల వల్ల ద్విచక్ర వాహనదారులు రోడ్లపై కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తూ పలువురు ప్రమాదానికి గురి అయ్యారని అన్నారు… నిత్యావసర సరుకులు ఖరీదు చేసి ఇంటికి వెళుతున్న మహిళల చేతులలో ఉన్న సంచులను వీధి కుక్కలు వారిపై దాడి చేసి లాక్కొని వెళ్తున్నాయని తెలిపారు… ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.. ప్రత్యేక అధికారి గారు తక్షణమే చర్యలు తీసుకుని వీధి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు రాజా రమేష్ యాదవ్, నరేష్ రెడ్డి, సందీప్ రాజ్, జహీర్, అజయ్ స్వామి, అల్లాడి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.