సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు
రామడుగు, నేటిధాత్రి:
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తెలంగాణ (మోడల్) ఆదర్శ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. సిఈసి ప్రథమ సంవత్సరం ఫలితాల్లో భోగ శ్రీజ 494/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తెలియజేశారు. ఎంపిసి విభాగంలో పుట్ట హాసిని 448/470, అదరలేని వైష్ణవి 427/470, మ్యాడారం అంజనీ సామ్య 415/470, బైపిసి విభాగంలో ఎన్.జ్యోతి 389/440, జాడి హరిణి 350/440, గడ్డం నవ్య 342/440, సిఈసి మొదటి సంవత్సరంలో భోగ అర్చన 477/500, కూన రేణుక 462/500 మార్కులు, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపిసిలో కే.మహేశ్వరి 934/ 1000, ఎస్.సాయి ప్రణవి 896/1000, బైపిసిలో సిహెచ్.శ్రీవిద్య 893/1000, ఎమ్.ప్రణవి 829/1000, సిఈసిలో ఈ.కార్తిక్ 955/1000, కే.శ్రావణి 873/1000 మార్కులు సాధించి రామడుగు మోడల్ పాఠశాలను మండలంలో ముందు వరుసలో ఉంచారన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆడెపు మనోజ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుల బృందం, తదితరులు అభినందించారు.