చిట్యాల, నేటిధాత్రి:
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ట్రేడ్ యూనియన్ పిలుపుమేరకు చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్.శానిటేషన్ సిబ్బంది జీతాలు గత మూడు నెలల నుండి రావడం లేదు నెలలు తరబడి ఈపీఎఫ్ ,ఈఎస్ఐ ఏజెన్సీ కట్టడం లేదు. శ్రమ దోపిడీ చేస్తున్నారు జీతాలు ఇప్పించాలని ఈఎస్ఐ పీఎఫ్ లు కట్టించాలని. ఈనెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే ఆల్ ఇండియా కార్మిక సమ్మెలో భాగంగా వైద్య శాఖలో పనిచేస్తున్న వారి సమస్యల గురించి సమ్మెలో పాల్గొనవలసిందిగా తెలంగాణ మెడికల్ అండ్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తరపున సమ్మెలో పాల్గొంటున్నాం ఇట్టి సమ్మెకు అనుమతి ఇవ్వాలని హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ జీడి తిరుపతి కి వినతి పత్రం ఇవ్వనైనది, ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్కూరి నరేందర్. అంకం కిషోర్. బిట్ల రమణ. సిబ్బంది గురుకుంట్ల కిరణ్. రాజేష్. పుల్ల సతీష్. పాల శంకర్. ఆరెపల్లి శశి పాల్గొన్నారు.