
Agricultural Market.
తీరునా మా గోస
పరకాల వ్యవసాయమార్కెట్ లో యూరియా కోసం పడిగాపులు
పరకాల నేటిధాత్రి
మేలో ప్రకృతి అనుకూలిస్తుందని భావించిన రైతులు పంటల సాగులపై ఆశలు పెంచుకున్నారు.జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు,పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ సందర్బంగా పలువురు రైతులు,మహిళలు మాట్లాడుతూ పొలం పనులు వదులుకొని భార్యభర్తలం రోజంతా ఎదురుచూడాల్సి వస్తున్నదని,రోజంతా నిలబడితే రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని,పంటలు పెరిగే దశలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేసిఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు యూరియా కొరత ఉండేది కాదని అసలు యూరియా కోసం ఇలా లైన్ లలో ఎదురుచూసిన సందర్భాలు లేవన్నారు.

యూరియాను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు.ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.