
గత పాలకులవల్లే నిరుద్యోగ సమస్య పెరిగింది
* కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం : భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థిఎండీ. జహంగీర్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతుప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి.జహంగీర్ అన్నారు.శనివారంమునుగోడు మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ మండల బాధ్యుల సమావేశంజరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నల్గొండ,ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందన్నారు. పార్లమెంటు ఎన్నికలలో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం, ఇండియా బ్లాక్ భాగస్వామి అయినకాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామన్నారు.దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మతోన్మాద బిజెపిని ఓడించడం కోసం, బి ఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకుమద్దతు ప్రకటిస్తున్నామనిఅన్నారు.గత ప్రభుత్వాలుమోడీ ప్రభుత్వం,కెసిఆర్ ప్రభుత్వంనిరుద్యోగ సమస్యను పెంచి పోషించిందన్నారు. పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలన్నారు. మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు. పట్టభద్రులందరూ ఇండియా కూటమి అభ్యర్థి ఆయన తీన్మార్ మల్లన్న గెలిపించేందుకు పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోటిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని ఆయన అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిందనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, మునుగోడు మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, , పార్టీ మండల నాయకులు వేముల లింగస్వామి, వెంకన్నతదితరులు పాల్గొన్నారు.