* : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
మునుగోడు,దేవరకొండనియోజకవర్గాలకుసాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో సుమారు3.41 వేల ఎకరాల ఆయ కట్టును స్థిరీకరించారు అని ఆయన అన్నారు. సింగరాజుపల్లి, గొట్టిముక్కుల,చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్న గూడెం రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నది గాని గత ప్రభుత్వం డిపిఆర్ ను ఆమోదించలేదని, పర్యావరణ అనుమతుల కోసం లేఖ రాయలేదని దీంతో ఈ ప్రాజెక్టుల విషయంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదనిఆయన అన్నారు.
2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు. మునుగోడు,దేవరకొండ ప్రాజెక్టులకుపర్యావరణ అనుమతులు,అటవీ శాఖ అనుమతులుఇవ్వాలని.పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు తరహా మా ప్రాంతాల కూడా అన్ని అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. మా ప్రాంతాలకుసాగునీరు- త్రాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగుతుందనిఆయన తెలిపారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామనిఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, సిపిఎంసీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం నేర్మట గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి, రాసాల బుగ్గయ్య, రాములు,హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ కాలాపు అంజయ్య, గాలింక నరేష్, నవీన్, వెంకన్నతదితరులు పాల్గొన్నారు.