*కాలేజీ నుంచి కార్పొరేట్ జాబ్ వైపే మా లక్ష్యం:

ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా*

లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి :
విద్యార్థులు కాలేజీ నుంచి కార్పొరేట్ జాబ్ లను సాధించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీ ఎస్ కే సీ ( తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ) కో -ఆర్డినేటర్ మంజుల, మెంటర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. రామ్, ముతూట్,24 సెవెన్,హెటిరో వంటి ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ, తమ కళాశాలలో నాణ్యమైన చదువుతో పాటు విద్యార్థులను కార్పొరేట్ ఉద్యోగాలు సాధించేలా స్పష్టమైన ప్రణాళికతో సన్నద్ధం చేస్తున్నామన్నారు. పోటీ ప్రపంచంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించవని, ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తూ రాణించాలన్నారు. మేధస్సుకు హద్దులు లేవని గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలను నడిపిస్తున్నది మన భారతీయులేనని గుర్తించాలన్నారు. అనంతరం పలు కంపెనీల హెచ్ ఆర్ లు మాట్లాడుతూ, మారుతున్న సమాజంలో అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ కంపెనీల గురించి వివరిస్తూ ఉద్యోగులకు మంచి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ సాయి లక్ష్మణ్, హెచ్ ఆర్ లు శ్రీకాంత్, దుర్గాప్రసాద్, కిరణ్, శ్రీహర్ష లు సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా విద్యార్థులు, నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరైనారు. ముతూట్ లో 26 మంది, రామ్ లో 22 మంది, 24 సెవెన్ లో 48, హెటిరో 15 మంది మొత్తం 111 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!