Traditional “Grahan Rokali” Ritual Observed During Lunar Eclipse
గ్రహణ రోకలి..?!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : గ్రామీణ ప్రాంతాల్లో సూర్య గ్రహణం
లేదా చంద్రగ్రహణం సందర్భాల్లో కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం ఆనవాయితీగా ఉంది. గ్రహణ సమయంలో ఇత్తడి తాంబూలం (లేదా పళ్లెం)లో నీళ్లు పోసి, అందులో రోకలిబండను నిలబెట్టడాన్ని “గ్రహణ రోకలి” అని పిలుస్తారు. గ్రహణం పట్టే ముందు ఇత్తడి పళ్లెంలో నీరు పోసి, ఆ నీటిలో రోకలిబండను నిలబెట్టడం ద్వారా గ్రహణం ప్రారంభమైందని గుర్తిస్తారని పెద్దలు చెబుతారు. అలాగే, గ్రహణం విడిచే సమయంలో రోకలి బండ కిందపడిపోతుందని ఒక నమ్మకం ఉంది. మంగళవారం జరిగిన చంద్రగ్రహణం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో పలువురు ఈ “గ్రహణ రోకలి” ఆచారాన్ని పాటించడం కనిపించింది.
బర్దిపూర్ తో పాటు కుప్పానగర్, మాచునూర్, కృష్ణాపూర్ పొట్టిపల్లి తదితర గ్రామాల్లో ఈ విధంగా గ్రహణాన్ని వీక్షించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ కొనసాగడం గమనార్హం
