ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు లేదు

-వాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి

-రైతు బిడ్డను కాబట్టే రైతు విలువ తెలుసు

-బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి

-చిరుజల్లులలో ఆగని జోరు కారు ప్రచారం

#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని రామన్నకుంట తండా గ్రామపంచాయతీ నుండి మంగళవారం నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. రామన్నకుంట తండా మీది నుండి అమీన్ పేట, పనికర, దేవుని తండా, దీక్షకుంట, సీతారాంపురం, ముదిగొండ, బంజరపల్లి, గొల్లపల్లి, చంద్రుగొండ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటర్లను కోరారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముదిగొండ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దరం జరిగిందని నర్సంపేట నియోజకవర్గం లో అతిపెద్ద ఆసుపత్రి కట్టించిన ఘనత కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దేనని తాను రైతు కుటుంబం నుండి వచ్చాను కాబట్టి రైతు పడే కష్టం విలువ తెలిసిన వాడిని కాబట్టి రైతులు ఇబ్బంది పడొద్దు అని రైతులకు అవసరమే పనిముట్లను స్పెషల్ జీవో ద్వారా నర్సంపేట రైతులందరికీ 50% సబ్సిడీ ద్వారా పనిముట్లను అందజేశామని అకాల వర్షాలకు రాళ్ల వానతో నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారాన్ని అందజేసిన ఘనత కేవలం కెసిఆర్ ది తనదేనని అన్నారు. ఈ విధంగా రైతులకు సేవలు అందించిన రైతు బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి కావాలా… లేక ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ రూపంలో దొసుకుతునే కాంట్రాక్టర్లు కావాలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అంతేగాక గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దాయన చేసిన పనులు ఏంటో చెప్పి ప్రజల వద్ద ఓటు అడగాలని ఒకసారి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నర్సంపేట నియోజకవర్గం లో నెక్కొండ మండలంలో ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని ప్రపంచాన్ని గడగడల ఆడించిన కరోనా మహమ్మారితో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ప్రజల మనిషిగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని కరోనా ఆపద్కర పరిస్థితులలో తన క్యాంప్ ఆఫీస్ పక్కనే ప్రభుత్వ పాఠశాలలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది ని కరోనా మహమ్మారి నుండి కాపాడానని ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న కనీసం ప్రజల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు ఎన్నికలు రాగానే ప్రజల వద్దకు ముసలి కన్నీరు కార్చుకుంటూ వస్తున్నారని వారికి సరైన బుద్ధి ప్రజలే చెప్పాలని కనీసం ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు కూడా లేదని ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికలలో తమ బిడ్డగా ప్రజలందరూ ఆదరించి కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం గొల్లపల్లి మరియు చంద్రుగొండ గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య, ఎంపీపీ జాటు రమేష్ నాయక్, జడ్పిటిసి సరోజా హరికిషన్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల వర్కింగ్ ప్రెసిడెంట్ సూరం రాజిరెడ్డి, నాయకులు తాటి పెళ్లి శివకుమార్, కట్టుకూరి నరేందర్ రెడ్డి, గుంటుక సోమయ్య, పలు గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!