Green Star Hospital Launches Ophthalmology Unit in Narsampet
గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం
నర్సంపేట,నేటిధాత్రి:
*నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆప్తమాలజీ కంటి వైద్య యూనిట్ ను ప్రారంభించినట్లు గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.నేటి నుండి స్టార్ హాస్పిటల్ లో కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కంటి ఆపరేషన్లు కంటిలో పోరా, లెన్స్ లాంటి ఆపరేషన్లు కూడా చేయబడును అని డయాబెటిక్ పేషెంట్లకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ విద్య, కంటి వైద్య నిపుణులు నామాల అనిల్, గ్రీన్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్లు బీరం నాగిరెడ్డి, నాయుడు శ్రీనివాస్,అనంతగిరి రవి,గోనె యువరాజు,పీఆర్ఓ రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
