గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి
జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.