
ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలి.
⏩మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.
⏩కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.
⏩సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర.
⏩కర్రెగుట్టల నుండి బలగాలను వెనక్కి రప్పించాలి
⏩ఏజెన్సీ ఏరియాలో శాంతియుత వాతావరణం కల్పించాలి.
ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,దళిత రత్న కేదాసి మోహన్
కాశిబుగ్గ నేటిధాత్రి
మావోయిస్టుల పై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మార్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న కేదాసి మోహన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అనంతరం కేదాసి మోహన్ మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.సహజ వనరులను, విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టె కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను హత్య చేస్తున్నారని ఆయన ఆరోపించారు.మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారని కర్రెగుట్టల నుండి పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాణాల హననాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ మంజాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్,తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య,వివిధ ప్రజా సంఘాల నాయకులు పిట్టల రాజమౌళి,మంద నవీన్,గుండ్ల కాశీం,పారనందుల శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.