Congress Leader Alleges Illegal Ready Mix Plant at Nallabelli
ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ.
#విచారణకే పరిమితమైన మైనింగ్ అధికారుల పనితీరు.
#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే రెడ్ మిక్స్ ప్లాంట్ నిర్వహణ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ కు వినతి పత్రం అందించి తక్షణమే సిమెంట్ క్రషర్ ను తొలగించి విద్యార్థుల, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం గ్రామపంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సంబంధిత అధికారుల ను భయభ్రాంతులకు గురిచేసి క్రషర్ నిర్వహణ చేశారని. అలాగే ప్లాంట్ కు ఇరువైపులా ఉన్న కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు, రామాలయం కు వచ్చే భక్తులకు క్రషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప క్రషర్ ను తొలగించి సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రెడ్ మిక్స్ ప్లాంట్ యజమానులపై చర్యలు తీసుకొని ప్లాంటును తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా లింగయ్య, బిక్షపతి, కిషోర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
