ప్రారంభించిన జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు(ADJF) తీగల శ్రీనివాస్ రావు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నేటిదాత్రి:
దండేపెల్లి మండలం తాళ్లపేట మెయిన్ రోడ్ లో మహాదేవ్ షాపింగ్ మాల్ & టైలరింగ్ ని జర్నలిస్ట్ యూనియన్ (ADJF) రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రారంభించారు అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తాళ్ళపేట పరిసర ప్రాంత ప్రజలకు మంచిర్యాల, హైదరాబాద్ లాంటి మహా నాగరాలలో దొరికే అన్ని రకాల డిజైన్ లలో ఇప్పుడు సరసమైన ధరలకు మన తాళ్లపేట అందించటం చాలా సంతోషం అన్నారు. పిల్లలకు అన్ని రకాల వెరైటీలు, మహిళలకు వారి వారి ఆసక్తికి అనుగుణంగా అన్ని రకాల చీరలు అందుబాటులో ఉంచటం స్థానికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు అంతే కాకుండా టైలరింగ్ లో నేటి మహిళల ఆసక్తికి అనుగుణంగా అన్ని రకాల డిజైన్ లలో కుట్టి ఇవ్వటం, ఎంబ్రాయిడారి, మగ్గం వర్క్ వేసి వివాహాది శుభాకార్యలకు అతి తక్కువ ధరలకు సమయానికి అందించటం వలన తాళ్ళపేట పరిసర ప్రాంత ప్రజలకు సమయం ఆదా అవటం తో పాటు సరాసమైనా ధరలకు లభిస్తున్నాయని అన్నారు ఈ అవకాశాన్ని తాళ్లపేట పరిసర ప్రాంత ప్రజలు వినోయోగించుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలొ స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు