కుట్టుమిషన్ నేర్చుకోవడం ఎంతో ముఖ్యం కోసరి గోపాల్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోరండ్ల భానుమతి ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ కన్స్ట్రక్షన్స్ మరియు ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తు న్నటువంటి 90 రోజుల ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ మహిళలు కుటుంబ అవసరాలకు చేదోడు వాదోడుగా నిలబడడం కొరకై ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఇ కుట్టుమిషన్ నేర్చుకోవడం అనేది ఎంతో శ్రద్ధతో కూడుకున్నదని వివిధ రంగాలలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులచే దుస్తులను కుట్టించి అందించినందుకు కుటుంబానికి ఆర్థిక అభివృద్ధికి చెందడం జరుగుతుందని దీని గాను జాతీయ అకాడమీ కన్స్ట్రక్షన్స్ మరియు ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం నేర్చుకోవడం ఎంతో మంచిదని ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి సంఘాలకు అభినందించారు.దీని ద్వారా నైపుణ్యతను కలిగి ఉండడమే కాకుండా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో కూడా అర్హతను సాధించేందుకు ఈ కుట్టు మిషిని నేర్చుకునే అవకాశం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా కోఆర్డినేటర్ సబిత మాట్లాడుతూ మహిళలలో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడం కొరకై ఇలాంటి కార్యక్రమాలు ఎంతో గాను ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కుట్టు మిషన్ నేర్చుకోవడం వల్ల కుటుంబ అవసరాలకు చేదోడు వాదోడుగా తమ వంతుగా నిలవచ్చని సూచించారు… ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం పాలకవర్గ సభ్యులు ఎడ్ల రజిత, కుకిడి నాగేశ్వరరావు ఎన్.ఎ.సి ప్రతినిధి సురేందర్, రాజకుమారి ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం పియు మేనేజర్ ప్రియాంక రెడ్డి ప్రతినిధులు అక్కల రమేష్, ఎస్కే గౌస్ పల్నాటి రాంబాబు బి సి ఐ కో ఫార్మర్స్, బి సి ఐ రైతులు కోకిడి శివాజీ రాజేందర్ కిషన్ రెడ్డి రాజేశ్వరరావు మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు కరోబార్ తదితరులు పాల్గొన్నారు.