
డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్
ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని
యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ లేదా తస్తమాన విద్యను పూర్తిచేసి పాసైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి బీఏ,బీకం,బీఎస్సీ కోర్సులలో చేరేందుకుగాను 30న చివరితేది అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రిన్సిపాల్ అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్ మాట్లాడుతూ ఇంటి దగ్గర లేదా ఉపాధి చేసుకుంటూ విద్యను అభ్యసించాలనుకుంటే విద్యార్థులకు బిఆర్ఏఓయూ దూరవిద్య మంచి అవకాశాన్ని కల్పిస్తుందని టిప్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ పొందిన వారు కూడా ఓపెన్ డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎలిశాల అశోక్, డాక్టర్.దుప్పటి సంజయ్,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.