తొర్రూర్ (డివిజన్ )నేటి ధాత్రి పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు అత్యధికంగా మేలు జరిగిందని పిఎసిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ కాకిరాల హరి ప్రసాదరావు అన్నారు
మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సొసైటీ పరిధిలో సొసైటీ కార్యాలయంలో సెప్టెంబర్ 17న పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పలన దినోత్సవం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశత్వ పాలనలో ఉందని,చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని,దీంతో సెప్టెంబర్ 17న విమోచన దినంగా పేర్కొంటారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఉత్తర్వులు జారీ చేశాయని,అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్లు కల్వకోలను జనార్దన్ రాజు, పిఎసిఎస్ సెక్రటరీ వెలుగు మురళి, సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు.
