Online Job Scam in Mandamarri – Police Warn Public
పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్లైన్ మోసం
మందమర్రి నేటి ధాత్రి
సైబర్ వలలో చిక్కుకోవద్దు:
మందమర్రి ఎస్ఐ రాజశేఖర్.
పోలీస్ శాఖ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయునది ఏమనగా, ఇటీవల ‘పార్ట్‌టైమ్ ఉద్యోగాలు’ లేదా ‘ఆన్లైన్ టాస్క్‌లు’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మందమర్రి పట్టణం ఫస్ట్ జోన్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ‘గూగుల్ రివ్యూ మేనేజ్మెంట్’ సంస్థలో ఉద్యోగం పేరుతో వచ్చిన వాట్సాప్ మెసేజ్‌కు స్పందించి, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో 48,500/- రూపాయలు మోసపోయారు. ఈ సంఘటనలో సైబర్ నేరగాళ్లు ముందుగా చిన్న టాస్క్‌లు (ఉదాహరణకు: 5-స్టార్ రేటింగ్ ఇవ్వడం) పూర్తి చేయించి, రూ. 200 వంటి స్వల్ప మొత్తాన్ని జీతంగా చెల్లించారు. ఆ తరువాత, ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, ఇది ‘చివరి ఆర్డర్’ అని చెప్పి, బాధితుడిని పలు దఫాలుగా వారి ఖాతాలకు డబ్బు పంపమని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆయన మొత్తం రూ. 48,500/- కోల్పోయారు.
ఇటువంటి మోసపూరిత వలలో ఎవరూ చిక్కుకోకుండా ఉండేందుకు, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లను అస్సలు నమ్మవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. అలాగే, బ్యాంక్ వివరాలు, ఓటీపీ (ఓటిపి), ఏటీఎం పిన్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్లోగానీ, మెసేజ్‌ల ద్వారా గానీ ఎవరికీ తెలియజేయకూడదు. అనుమానాస్పద లింక్‌లు లేదా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించడం ద్వారా సైబర్ నేరగాళ్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే జాతీయ టోల్-ఫ్రీ నంబర్ 1930కు డయల్ చేసి ఫిర్యాదు నమోదు చేయండి. లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ నేరాల నియంత్రణకు, పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా వ్యవహరించాలని మంద
