
Online Foundation Course for MBBS Students in Narsampet
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆన్లైన్ ఫౌండేషన్ కోర్సు
మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దివ్వెల మోహన్ దాస్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దివ్వెల మోహన్ దాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 47 మంది విద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందడం జరిగిందన్నారు. వీరిలో ఆల్ ఇండియా ర్యాంక్ పొందిన విద్యార్థులు ఐదుగురు, రాష్ట్రస్థాయి ర్యాంకు 42 మంది విద్యార్థులు ప్రవేశం పొందడం జరిగిందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు ప్రారంభించడం జరిగిందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.ఈ తరగతులు ఈ నెల 23 నుండి కళాశాలలో ఆఫ్ లైన్ లో క్లాసులు ప్రారంభించబడునని ప్రిన్సిపల్ డాక్టర్ దివ్వెల మోహన్ దాస్ తెలిపారు.