
Online Essay Contest for Students on Police Flag Day
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు
పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
మంచిర్యాల,నేటి ధాత్రి:
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర,విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని,అంతే కాకుండా రామగుండం పోలీస్ కమీషనరేట్ స్థాయిలో 1వ, 2వ,3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడుతాయి అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.పోటీలో పాల్గొనే విధానం కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
మీ పేరు,విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయండి.వ్యాసాన్ని పేపర్ పై రాసి,దానిని చిత్రం (ఇమేజ్) లేదా పిడిఎఫ్ ఫార్మాట్ లో 500 పదాలు మించకుండా అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు.