బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్
హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.