-వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం బిఆర్ఎస్ పార్టీకి లేదు..
-రాజుపేట మహిళా గ్రామ కమిటీ అధ్యక్షురాలు భూతం సుశీల
మంగపేట నేటిధాత్రి
రాజుపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో
రాజుపేట మహిళా గ్రామ కమిటీ అధ్యక్షురాలు భూతం సుశీల మాట్లాడుతూ
ఏ రోజైతే బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం జ్యోతక్కను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక చేసిందో ఆ రోజు నుండి సీతక్కకు ఓటమి భయం పట్టుకొని జ్యోతక్క మీద బిఆర్ఎస్ పార్టీ మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారనీ, అన్నారు సీతక్క ..మీ నాయకత్వాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కరిగా జ్యోతక్క వెంట నడుస్తుంటే బహుశ మీకు కంటికి నిద్ర రానట్టుంది అందుకనే ప్రతిరోజు జ్యోతక్క మీద అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు, నిజంగా మీరు అభివృద్ధి చేసినట్లయితే ఈ ములుగు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారన్నట్టయితే రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది ఈ ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం మీకుందా లేదా జ్యోతక్క ఉందా అనేది, ఇప్పటికే దాదాపు మీ ఓటమి ఖరారు అయిందని మీరు లేనిపోని అబద్ధపు ఆరోపణలు ప్రచారాలు బిఆర్ఎస్ పార్టీ మీద, ప్రజా నాయకురాలు మా జ్యోతక్క మీద చేస్తున్నారు, ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే ఈ ములుగు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మీరు గ్రహించాలి..
అని ఆమె అన్నారు..
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.