ఒక్క” ఝాట్కా,1.25″ క్వింటాళ్ల మట్కా.

Policy on illegal

ఒక్క” ఝాట్కా,1.25″ క్వింటాళ్ల మట్కా.

అక్రమ ఇసుక రవాణాలో కొత్త పాలసీ శ్రీకారం చుట్టిన ఈ క్వారీలు.

అందుకే నో కాంటా,లోడింగ్ ,సీరియల్, వేబిల్ వద్ద వసూళ్లు.

లోడింగ్ వద్ద, వసూళ్ల సాక్షాలు చూపించిన నో యాక్షన్.

గుత్తేదారుకు గుమస్తాగా, మారిన మైనింగ్ సిబ్బంది అధికారి.

బొమ్మపూర్, ఎలేకేశ్వరం, ఇసుక రీచ్ లలో ప్రభుత్వ సాండ్ పాలసీ నిబంధనలు డోంట్ కేర్.

సమాచారం బయటకు పోక్క కుండా, ఈ క్వారీల్లో లోకల్ యువకులకు నో ఛాన్స్.

వసూళ్ల పర్వం, కొత్తరకం అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న, ఈ క్వారీలపై మైనింగ్ ఎండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొమ్మ పూర్ ఎలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న రెండు ఇసుక క్వారీలు, ప్రభుత్వ సాండ్ పాలసీకి విరుద్ధంగా ఒక కొత్త రకమైన అక్రమ ఇసుక రవాణా, వసూళ్ల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. లోడింగ్ వద్ద 300 రూపాయలు, సీరియల్ వద్ద 200, వే బిల్ వద్ద 300 వసూళ్లను కొనసాగిస్తుంది, లోడ్ అయిన ఇసుక లారీలు కాంటా చేయకుండా” రైట్” అని పంపిస్తుంది. మైనింగ్ అధికారులు సిబ్బంది అందరూ, కాంట్రాక్టర్ గుడిసెలో రెస్ట్ తీసుకుంటూ వ్యవహారం అంతా చూస్తూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీలు అధికారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ కి అ అమలు చేస్తున్నట్లుగా నటిస్తూ, ఒక కొత్త రకమైన ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టింది, “అదే ‘ఒక్క ఝాట్కా 1.25 కింటల్ ఇలా మట్కా”, వింటేనే విచిత్రంగా ఉంది కదా, కానీ ఎవరికి అర్థం కాకుండా, గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న, ఈ రెండు క్వారీల అక్రమ ఇసుక రవాణా భాగోతం ఇది.

ఒక్క “ఝాట్కా,1.25′ క్వింటాళ్ల మట్కా.

Policy on illegal
Policy on illegal

 

 

కొమ్మాపూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల్లో ” ఒక్క జట్కా1.25 క్వింటాళ్ల మట్కా, ఎవరు పసుగట్టని అక్రమ ఇసుక లోడింగ్ వ్యవహారం ఇది, ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీలు, సుమారు ప్రారంభం దశ నుండి 80 లారీల లోడింగ్ మొదలుకొని 175 భారీ ల వరకు రెండు క్వారీలు రోజుకు ఒక కారి లారీలను తమ ఖాతాలో ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది, మండలంలో గత మూడు నెలల్లో 13 ఇసుక క్వారీలు కొనసాగగా, సోమవారం నాటికి 9 ఇసుక క్వారీలు ఇసుక రవాణా కొనసాగిస్తున్నాయి, వీటన్నిటిలో ఈ రెండు క్వారీలు ప్రారంభం దశ నుండి పెద్ద మొత్తంలో ఇసుక రవాణా సోమవారం నాటికి ఇలికేశ్వరం క్వారీలో 239 లారీలు, బొమ్మ పూర్ క్వారీలో 102 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది, ఇక “ఝాట్కా” విషయానికొస్తే లారీల సైజులను బట్టి 26 టన్నుల నుండి 36 తన వరకు, ఇసుక తీసుకువెళ్లే కెపాసిటీ కలిగి ఉంటాయి, లోడింగ్ పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన పొక్లెన్ బకెట్లో మూడు టన్నుల ఇసుక తోడడం జరుగుతుంది, అదేవిధంగా పెద్ద బకెట్ సైజులో ఐదు టన్నుల ఇసుకను తోడడం జరుగుతుంది, ప్రస్తుతం ఈ రెండు క్వారీల్లో చిన్న సైజు బకెట్లను ఉపయోగిస్తూ లారీల్లో ఇసుక నింపడం జరుగుతుంది. చివరి బకెట్లో నింపే క్రమంలో ఆపరేటర్ ఒక్క జట్కాను ఇవ్వడంతో, చివరి బకెట్ నుండి సుమారు ఒక టన్ను 25 క్వింటాళ్ల ఇసుక లారీలో రావడం జరుగుతుంది. చిన్న పెద్ద లారీల కెపాసిటీ కు మించి ఒక్క అదనపు బకెట్లో ని ఒక్క భాగం ఇసుక నింపడం జరుగుతుంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లతోపాటు, టీఎస్ ఎంబీసీ అధికారులకు సిబ్బందికి, జట్కా విషయం తెలవడంతో, లారీలకు కాంట చేయకుండా, వే బిల్ రెడీ అయిపోయి, డ్రైవర్ లేదా క్లీనర్ కు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు జట్కా పేరుతో వందల టన్నుల ఇసుక అక్రమంగా రవాణా కావడం జరుగుతుంది.

లోడింగ్ వద్ద వసూళ్ల సాక్షాలు చూపించిన నో యాక్షన్.

ఈ రెండు ఇసుక క్వారీలో అంతుచిక్కని అక్రమాలు చేపడుతూ, వసూళ్ల పర్వం అక్రమ ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ పోక్లైన్ లో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న సాక్షాలు చూపెట్టిన, లోడింగ్ చేసుకున్న డ్రైవర్లు తమ వద్ద ఎనిమిది వందల రూపాయలను చేయడం జరుగుతుంది, అన్న సాక్షాలను కూడా తెలిపినప్పటికీ, మైనింగ్ అధికారులు ఈ రెండు ఇసుక క్వారీలపై కనీసం కన్నెత్తి చూడని దౌర్భాగ్యం పరిస్థితి, నువ్వంటే ఈ రెండు ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు మైనింగ్ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ, వాటాదారులుగా మారారు అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు. లోడింగ్ పాయింట్ వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది లేకుండా, రాత్రి వరకు లోడింగ్ కొనసాగించడం, ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిది తర్వాత కూడా లోడింగ్ కొనసాగడం, కాంటా చేయకుండానే వేబిల్ అందించడం, లోడింగ్ వద్ద చట్కా బకెట్ చివరికి ఎందుకు రియాల్సి వస్తుంది అన్న విషయం, మైనింగ్ అధికారులకు తెలవకుండానే కొనసాగుతుందా, అదనపు బకెట్ల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో, మైనింగ్ అధికారులతో కాంట్రాక్టర్లు మూలకాతై, టిఎస్ఎండిసి సిబ్బంది అధికారులను కాంట్రాక్టర్లు గుభస్తాలుగా మార్చుకొని, ఎనలేని అక్రమ వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టి, చట్కా తో అదనపు ఇసుకను లారీల్లో నింపి సొమ్ము చేసుకుంటూ, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కడం జరుగుతుంది.

వసూళ్ల పర్వం, కొత్తరకం అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న, ఈ క్వారీలపై మైనింగ్ ఎండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇసుక క్వారీలో అంతర్గత వ్యవహారాలను బయటకు పొక్కకుండా, అక్రమ ఇసుక రవాణా వ్యవహారం వసూళ్ల పర్వం, కాంట్రాక్టర్ ల వరకే పరిమితంగా ఉండాలని ఈ రెండు ఇసుక క్వారీలో, సూపర్వైజర్లుగా పనిచేసే యువకులు అంతా, ఇతర ప్రాంతాలకు అలాగే కాంట్రాక్టర్ లా సంబంధించిన వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థానిక యువకులకు సూపర్వైజర్ అవకాశం కల్పించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు చెప్పిన యజమాన్యం డోంట్ కేర్ అని క్వారీలో నీటికి ఉపాధి కొరకు అవకాశం ఇవ్వక పోవడానికి ప్రధాన కారణం ఇదే, మండలంలో వందల సంఖ్యలో లారీలో ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ నిబంధనలు సాండ్ పాలసీకు విరుద్ధంగా, “ఝాట్కా” పేరుతో అక్రమ ఇసుక రవాణా దర్జాగా వసూళ్లను చేస్తున్నప్పటికీ, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు కూడా ఈ రెండు ఇసుక క్వారీలకు పరోక్షంగా సహకరించడం జరుగుతుంది. మైనింగ్ శాఖ టీఎస్ఎండిసి ఉన్నత అధికారులు తక్షణమే ఈ రెండు ఇసుక క్వారీలపై అలాగే సిబ్బంది అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!