మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో మరోసారి అరుదైన చికిత్స

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో ఒక నవజాత మగ శిశువుకు అరుదైన చికిత్స చేసి ప్రాణాలను కాపాడడం జరిగింది. వివరాల్లోకి వెళితే రాపల్లి వాసి అయినటువంటి ఆకాంక్ష వారం రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది.పుట్టిన ఏడు రోజులలోనే ఆ నవజాత మగ శిశువు తీవ్రఅనారోగ్యం పాలై, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేరే చోటికి తీసుకెళ్లమనడంతో తెలిసిన వారి ద్వారా మల్లికార్జున పిల్లల ఆసుపత్రికి వచ్చి పిల్లల వైద్య నిపుణుడు గోపతి శ్రీనివాస్ ని సంప్రదించగా శిశువు పరిస్థితి విషమంగా ఉందని గమనించిన వైద్యుడు శ్రీనివాస్ వెంటనే స్పందించి అత్యవసర విభాగంలో ఆక్సిజన్ మరియు అధునాతన చికిత్స అందించి బాబును క్షుణ్ణంగా పరీక్షించి అవసరమైనటువంటి రక్త పరీక్షలు చేపించి ప్రాణాంతకమైన డెంగ్యూ విష జ్వరం సోకిందని,రక్త కణాల సంఖ్య 30 వేలకు పడిపోయిందని,అలాగే డెంగ్యూ జ్వరం ఆ శిశువు యొక్క గుండెపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల గుండెకి సంబంధించిన చికిత్స కూడా అవసరమేనని నిర్ధారణ చేసుకుని బాబు ఆరోగ్య పరిస్థితిని కుటుంబీకులకు వివరించి వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసియూ)లో అడ్మిషన్ చేసి ఆరు రోజులపాటు ప్రత్యేక శ్రద్ధతో శిశువుకు అవసరమైనటువంటి అన్ని విధాల అత్యాధునిక వైద్యం అందిస్తూ,24/7 పర్యవేక్షణ చేస్తూ ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్న శిశువుని పూర్తి ఆరోగ్యవంతునిగా చేసి వారి తల్లిదండ్రులకు అందించారు డాక్టర్ శ్రీనివాస్.శిశువు తల్లి ఆకాంక్ష మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా బాబు పరిస్థితి చూసి భయంతో మానసికంగా కృంగిపోయి ఆందోళనలో ఉన్న మాకు మాటలతో ఓదార్పును కలిగిస్తూ,ఎప్పటికప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ మనోధైర్యాన్ని నింపి రాత్రింబవళ్లు ప్రత్యేక చొరవతో వైద్యాన్ని అందించి మా చిన్నారి ప్రాణాలను కాపాడిన మల్లికార్జున పిల్లల ఆసుపత్రి వైద్యుడు శ్రీనివాస్ మరియు ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *