కొడిమ్యాల (నేటి ధాత్రి) :
జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజు తిప్పాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ మ్యాకల లత మల్లేశం పదవి కాలం ముగుస్తున్న సందర్భంగా ఉపసర్పంచ్ కు వార్డు సభ్యుల కు పంచాయతీ కార్యదర్శి కి, గ్రామ పంచాయతీ సిబ్బంది కి, గ్రామ స్థాయి ఉద్యోగులు ( అంగన్వాడీ టీచర్లు, వివో ఏ ,రేషన్ డీలర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్) లకు శాలువా కప్పి సన్మానం చేసినారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ స్థాయి ఉద్యోగులు, గ్రామ ప్రజలు శ్రీమతి శ్రీ మ్యాకల లత మల్లేశం సర్పంచ్ ని ఉపసర్పంచ్ చిగుర్ల దర్మెందర్ ని శాలువా కప్పి సగౌరవంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల లత మల్లేశంతో పాటు ఉపసర్పంచ్ చిగుర్ల దర్మెందర్, వార్డు సభ్యులు ఆకుల వెంకటేష్, బొక్కెన లక్ష్మి,సామల లత,గట్ల పద్మ, సట్టు మంజుల, దారం రత్నాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ స్థాయి ఉద్యోగులు,గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు బొక్కెన కిషన్, బొక్కెన కృష్ణంరాజు,గట్ల మల్లారెడ్డి,గట్ల ప్రవీణ్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పది కాలం ముగిస్తున్న సందర్భంగా సర్పంచ్, పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం
