తొర్రూర్ (డివిజన్ )నేటిధాత్రి:
భారతదేశ చరిత్రలో విప్లవ విద్యార్థి సంఘంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు తన 50వ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఆ సంఘం తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు భూక్య నందీశ్వర్ అన్నారు. నేడు తొర్రూరులో పిడిఎసు ఆఫీస్ లో 50 వసంతాల లోగోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ1974అక్టోబర్ 13,14 తేదీలలో పిడిఎసును జార్జిరెడ్డి, జంపాల ప్రసాద్ లు ఏర్పాటు చేసారని అన్నారు. నాటి నుండి పాలకులు కాలరాస్తున్న విద్యాహక్కును పొందటానికి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యార్థి పోరాట వెలువలో పిడిఎస్యు అగ్రభాగాల నిలిచిందన్నారు. పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనం సౌకర్యాల కల్పన కోసం గత 50 సంవత్సరాల నుండి జరిపిన సమరశీల పోరాటాల ప్రభావంతో అనేక విజయాలను సాధించారని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేడు విద్యలు అంగడి సరుకుగా మార్చి తమ బాధ్యత నుండి తప్పుకోవటానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పిడిఎస్యు ముందు నిలబడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో తీసుకొచ్చిన రిపోర్టును తిరస్కరించాలని సామాజిక న్యాయానికి,భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఆ విద్యా విధానాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని అన్నారు. సెప్టెంబర్ 30న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో పిడిఎస్యు పూర్వ ప్రస్తుత విద్యార్థులతో జరుగు వారి సభను జయప్రదం కై పూర్వ ప్రస్తుత విద్యార్థులు పెద్ద ఎత్తున కథలాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి రామ్ చరణ్ ఉపాధ్యక్షులు వెంకన్న సహాయ కార్యదర్శి సంతోష్ కోశాధికారి వీరు తో పాటు దేవేందర్ భాష ప్రశాంత్ బాలు మహేందర్ వెంకన్న వీరన్న తదితరులు పాల్గొన్నారు….