
డబుల్ బెడ్ రూమ్స్ కు తాళాలు వేసిన యన్మన్ గండ్ల గ్రామ ప్రజలు.
సర్పంచి నిర్లక్ష్యం వల్లే అందని డబుల్ బెడ్రూమ్స్.
ఇబ్బందికి గురవుతున్న దరఖాస్తుదారులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండకూడదని ప్రతి నిరు పేదకు డబుల్బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని హామీ ఇచ్చారు.అనుకున్నదే తడవుగా ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. డబుల్బెడ్రూమ్ ఇళ్లను తామే నిర్మించి పూర్తి సౌకర్యాలతో కూడిన కాలనీలను ఏర్పాటు చేసి ప్రజలకు పంపిణీ చేయాలన్నదే మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ కల. ఈ కలను సాకారం చేసేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ పథకం ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చి పెట్టలేకపోయింది.
మహబూబ్ నగర్ జిల్లా
నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాగా డబల్ బెడ్ రూమ్స్ ఓపెనింగ్ చేశారు.పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
నిర్మాణాలకు తప్ప పంపిణీ చేయడానికి తిప్పలుగా మారింది.
ఇప్పటి వరకు 48 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా
కేవలం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పంపిణీ చేయలేకపోయారు.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
అయినప్పటికీ డబుల్బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రజల్లో అసంతృప్తి మిగిల్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ప్రక్రియ మాత్రం ఆ గ్రామ సర్పంచ్ ఎమ్మార్వో దగ్గరకు వెళ్లి ఆన్లైన్లో పూర్తి చేయించి పొజిషన్ సర్టిఫికెట్ లబ్ధిదారుల పేర్లపై పొందే పరిస్థితి ఉంది. అయితే యన్మన్ గండ్ల గ్రామంలో సోమవారం రోజు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ల దగ్గరకు వెళ్లి రూమ్ లకు తాళాలు వేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న నవాబుపేట ఎమ్మార్వో మల్లికార్జున రావు వెంటనే ఆర్ ఐ. గోవర్ధన్ ను స్పాట్ దగ్గరికి పంపించి వివరాలు సేకరించారు. ఆర్ ఐ. గోవర్ధన్ మాట్లాడుతూ ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల స్థలాలను ఎవరికి కేటాయించలేదని అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు నచ్చజెప్పారు. ఐనా ప్రజలు వినకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రజలకు నచ్చజెప్పి పంపిచేశారు.