గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని జాతీయ అంబేద్కర్ సంఘం వినతి పత్రం.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఎస్సీ ఎస్టీ వాళ్లతో పాటు వెనుకబడ్డ బలహీన వర్గాల ప్రజలకు సివిల్ రైట్స్ డే నిర్వహించడంతోనే వారి సమస్యలు పరిష్కరించబడతాయని జాతీయ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డే కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు సూచించాలని జాతీయ అంబేద్కర్ సంఘం నాయకులు వినతి పత్రంలో కోరారు. అలాగే ప్రభుత్వ పథకాల నుండి బడుగు బలహీన వర్గాలు అనర్హులుగా ఉండకుండా అధికారులు సివిల్ రైట్స్ డేను నిర్వహించి పథకాలను లబ్ధి పొందే విధంగా చేయాలని జాతీయ అంబేద్కర్ సంఘం తాసిల్దార్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. వినతి పత్రం అందించిన వారిలో మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగాల రామయ్య ఉన్నారు.