జుక్కల్ ఎమ్మెల్యే తోట
కామారెడ్డి జిల్లా /జుక్కల్ నేటి ధాత్రి:
జుక్కల్ నియోజకవర్గం లోని వికలాంగులకు కామారెడ్డి జిల్లా లోని దివ్యాంగులకు సహాయ ఉపకరణములను ఉచితంగా పంపిణీ చేయుటకు గాను జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు ఆలీం కో సంస్థ ద్వారా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల వాసులకు జనవరి 23వ తేదీన, ఉదయం 9 గంటల నుండి బిచ్కుంద మండలంలోని రైతు వేదికలో శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, శిబిరం ప్రారంభింస్తున్నామని, శిబిరానికి వచ్చేవారు కచ్చితంగా సదరం సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు అసైన్ సెంటర్లో అప్లై చేసిన రిసిప్ట్ ను వెంట ఖచ్చితంగా తీసుకురావాలని అయితేనే వికలాంగులు శిబిరంలో పాల్గొనాలని ఒక ప్రకటనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగులు శిబిరం క్యాంపులో పాల్గొని సర్టిఫికెట్లను పొందాలని ఎమ్మెల్యే తెలిపారు.