ఈనెల 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జయప్రదం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

కేంద్ర బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలను నిరసిస్తూ
ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల
ఈ సందర్భంగా ప్రసంగించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బందు సాయిలు
కేంద్ర బిజెపి కార్పొరేటు మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫలాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి లక్షలాది కుటుంబాల్లో కార్మికుల్లో ప్రచారం చేయాలని ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ బందును నిర్వహించాలని జాయింట్ ఫ్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ సంఘాలు, అఖిలభారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా అఖిలభారత స్థాయిలో నిర్ణయించాయి. ఈ నిర్ణయం లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో కార్మికుల సమ్మె గ్రామీణ బంధువును జయప్రదం చేయాలని ఈరోజు కారలు మార్చు కాలనీలోని సిఐటియు ఆఫీసులో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, ఆదివాసి గిరిజన సంఘం, డివైఎఫ్ఐ, కెవిపిఎస్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య, జిఎంపిఎస్ ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కే రాజయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బంద్ సాయిలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సిసి బ్యాంకు నుండి నల్ల డబ్బులు తెచ్చి ప్రతి జీరో అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామని మాట మరిచారు, వ్యవసాయ రంగానికి ఎంఎస్పి రేటు కల్పించి, బీమా సౌకర్యం ఇస్తామని మాటిచ్చి తప్పడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారు, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. సంవత్సరానికి ₹200 పని రోజు కూలి 600 రూపాయలు ఇస్తామని చెప్పినా మోడీ సర్కారు మాట మార్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయం. కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడుదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించారు. కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారు. కొత్త పరిశ్రమలు లేవు కొత్త ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి స్థితి భారత దేశంలో ఏర్పడింది. బ్యాంకులు బిఎస్ఎన్ఎల్ రైలు విమాన యానం తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటు వారికి ధారాధత్వం చేశారు. విద్యారంగాన్ని కసాయికరణ చేసి గత చరిత్రను మొత్తము మార్చేసి కొత్త చరిత్ర రూపొందిస్తున్నారు. విద్యా వైద్యాన్ని గాలికొదిలేశారు. దళితుల మీద గిరిజనుల మీద ఆదివాసీల మీద మహిళల మీద మైనార్టీల మీద రోజు రోజుకు దాడులు హత్యలు హత్యాచారాలు పెరుగుతున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేసి దాని స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన మోడీ సర్కారు చేపట్టడం విడ్డూరం.
ఈ నేపథ్యంలో బిజెపి బిఎంఎస్ తప్ప దేశంలో ఉండే కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అందరు కూడా ఫిబ్రవరి 16 తారీకున జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ సర్కార్ను గద్దె దించడమే ధ్యేయంగా పనిచేయాలని ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. మోడీ తిరిగి అధికారంలోకి వస్తే మన ధర్మ శాస్త్రం తప్ప డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు వెలిశెట్టి రాజయ్య,వంగాల లక్ష్మి, కొండపాక రజిని, ఏం రాజేందర్,,ఏ స్వాతి, శేఖరు,సిహెచ్ రవికుమార్, రోజా, శారదా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!