ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి
ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎం సి పి ఐ యు-ఏఐసీటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న సోమవారం వరంగల్ జిల్లా మచ్చాపూర్ లో నిర్వహించే ఎంసీపీఐయు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూఅమరజీవి మద్ది కాయల ఓంకార్ నర్సంపేట నియోజకవర్గం నుండి 5సార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచినాడని ఆయన ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గల మెత్తడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సమస్యల అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు అని ఆయన అన్నారు.1984లో ఎం సి పి ఐ పార్టీని స్థాపించి అంచలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపచేసి 2006లో ఎం సిపిఐ యు గా ఏర్పరిచారని అన్నారు.నిత్యం బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి కొరకు తన జీవితకాలమంతా పోరాటాలను కొనసాగించినాడని వారి పోరాట ఫలితమే నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనని ఆయన అన్నారు.ఈ సభకు ప్రముఖ కవులు గోరేటి వెంకన్న,జయరాజు గాయకులు యోచన,ప్రజా కళాకారులు,వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని ఈ సభ విజయవంతం కొరకు విద్యార్థులు,యువకులు,సామాజిక ఉద్యమకారులు,అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:బొల్లోజు రామ్మోహన్ చారి,ధరావత్ రమేష్,వేల్పుల వెంకన్న,గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్,దుగ్గిరాల వెంకన్న,ధారావత్ వీరన్న, సాంబ,బెజ్జం ఐలేష్,కస్తూరి వెంకన్న,లాకావత్ రవి,దేవుల,బానోత్ ఈసు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.