2036 ఒలింపిక్స్ ఇండియాలోనే
VOICE
భారత్‌ను స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ తేదీన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపించినట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. భారత్‌లో ఒలింపిక్స్ వంటి మెగా క్రీడలను నిర్వహిస్తే ఐఓసి లాభం చేకూరే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అందుకే ఐఓసి కూడా భారత్‌కే ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం కల్పించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత క్రీడా రంగానికి కొత్త జోష్ లభించడం ఖాయం