#తీరొక్క పూలను అమర్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు.
#మండలంలో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల పండగ.
నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రకృతిని పరాశక్తిగా ఆరాధించే వేడుక బతుకమ్మ పండుగ రోజుకో తీరుగా సాగే పూల సంబరం ఇది వందల ఏళ్ల చరిత్ర ఉన్న బతుకమ్మ వేడుక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రకృతితో మమేకమైన పల్లె ప్రజల జీవన విధానానికి ఘనమైన ప్రతిగా ఈ పర్వం బతుకమ్మ… బతుకమ్మ… ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ మహిళలు పొంతెత్తి పాడుకుంటూ ఆటలాడుకునే పర్వానికి మండలంలోని పలు గ్రామాలలో మహిళలు శ్రీకారం చుట్టారు అశ్వియూజ శుద్ధ అమావాస్య నాటి నుంచి తొమ్మిది రోజులపాటు ప్రతి గ్రామంలో ప్రతి చోట పూలపరిమళాలు గుబాలించున్నాయి ముఖ్యంగా పెండ్లి అయిన మహిళలు వారి పుట్టింటిలో సరదాగా జరుపుకునే పర్వం బతకమ్మ… మహిళలంతా జట్టుగా అందంగా పేర్చిన పూల బతుకమ్మలతో ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూచిన్ననాటి జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఆడి పాడుకునే ఆటవిడుపు పర్వం ప్రారంభమైంది పలు గ్రామాలలో ఆడపడుచులు తీరొక్కపూలతో బతుకమ్మను పేర్చి అందులో గౌరమ్మను రాశిగా అమర్చి తమదైన శైలిలో మహిళలు ముస్తాబై బతుకమ్మతో బయలుదేరి గ్రామంలోని భూమాత వద్ద బతుకమ్మలను ఒకచోట పెట్టిఆటపాటలతో హోరెత్తించారు. మండల కేంద్రంలో ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునే విధంగా డీజే సౌండ్ సిస్టం తో పాటు, కలర్ఫుల్ లైట్లతో ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగిందని అదేవిధంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేపట్టామని 9రోజులపాటు బతకమ్మ వేడుకలను ఘనంగా సంబురంగా జరుపుకోవాలని సర్పంచ్ నానబోయిన రాజారాం యాదవ్ పేర్కొన్నారు.
#తీరొక్క పూలు అంటే ఏమిటి.
ఎలాంటి పశు సంపద ముట్టని ఎంగిలి పువ్వులను బతుకమ్మగా పేర్చి అందులో గౌరమ్మను అమర్చి తొమ్మిది రోజులపాటు నిష్టగా ప్రతి మహిళ సంబరంగా జరుపుకునే తెలంగాణకు ప్రతిదిగా నిలిచిన ఏకైక పండుగ సద్దుల బతుకమ్మ పండుగ గొప్పదనం తంగేడు, గునుగు, గుమ్మడి, గోరంట కట్ల, బీరా, బంతి, చామంతి, తామర, గులాబి, కమల తదితర పుష్పాలతో బతుకమ్మలనుతయారు చేసి మధ్యలో పసుపు తో తయారు చేసిన గౌరమ్మను పెట్టి నైవేద్యాలు సమర్పించి మహిళలందరూ ఏకమై పాటల రూపంలో గౌరమ్మను స్మరిస్తూ అనంతరం వాయినాలు ఇచ్చుపుచ్చుకొని గౌరమ్మను గంగమ్మ చెంతనకు సాగనంపడంతో సద్దులబతుకమ్మ పండుగ ముగుస్తుంది ఇలాంటి సాంప్రదాయ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండాయావత్ భారత దేశంలోనీ మహిళలు అనుసరించడం గొప్ప విషయమని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.