100 Acres Oil Palm Cultivation Target in Bhupalpally
100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్‌కుమార్, జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, జిల్లా వ్యవసాయాధికారి జాడి బాపురావు హాజరైనారు ఈ కార్యక్రమంలో
జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఉద్యాన శాఖ తరపున అమలవుతున్న వివిధ పథకాల ప్రయోజనాలు, భౌతిక లక్ష్యాలు, రైతులకు చేరే మద్దతు, అలాగే శాఖల సమన్వయం ద్వారా అమలులో వేగం పెరగాలని సూచించారు.
జిల్లా కోఆపరేటివ్ అధికారి వాలియా నాయక్ మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏపీసీ నిర్దేశించిన విధంగా 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, మండలాల వారీగా రైతుల అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు పథకాల లక్ష్యాలు, రాయితీలు, ప్రయోజనాలు, రైతులకు అందే లబ్ది గురించి ప్రజెంటేషన్ రూపంలో వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, సహకార సంఘాల సీఈఓలు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
