దోమల వ్యాప్తితో ప్రజలకు ఇబ్బందులు
నివారణ చర్యలు చేపట్టని గ్రామపంచాయతీ అధికారులు
స్పెషల్ ఆఫీసర్ లను నియమించిన ఫలితం శూన్యం
పరకాల నేటిధాత్రి
వర్షాకాలం ప్రారంభమై నెలరోజులుగడుస్తున్నా హనుమకొండ జిల్లా పరకాల మండలంలో ఉన్న రూరల్ గ్రామాలలో ఎలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంలేదు భారీగా వర్షాల కారణంగా కొన్ని గ్రామాలలో కాలనీలు బురదమయంతో నిండిపోయాయి.మురికి కాలువలల్లో,గుంతలు పడి ఉన్న ప్రదేశాలలో నీరు నిలువఉండటం వలన ఆ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఎక్కువగా ఈ వర్షాకాల సమయంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది టైఫాయిడ్ మలేరియా లాంటి సీజనల్ జ్వరాలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది.సర్పంచుల పదవీకాలం ముగియకముందైన అప్పుడప్పుడు బ్లీచింగ్ పౌడర్ గాని దోమల నివారణకు స్ప్రేలు గాని చేసేవారు. సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్న కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు ఎటువంటి బ్లీచింగ్ పౌడర్లు గాని దోమలు నివారించడానికి ఎలాంటి మందులు గాని స్ప్రే చేయలేదని తమ బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఆఫీసర్లు మరియు గ్రామపంచాయతీ అధికారులు ఎవరు కనీసం పట్టించుకున్న దాఖలు లేవని పట్టణానికి పల్లెలే పట్టుకొమ్మలని చెప్పుకోవచ్చే అధికారులే ప్రజల ఆరోగ్యాలను పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అనారోగ్యల భారిన పడకుండా కాపాడాలని కోరుకుంటున్నారు.