వనపర్తి నేటిదాత్రి
ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అంకిత భావంతో జిల్లా ప్రజలకు సేవ చేసిన వారిని ఎన్నటికీ మరచిపోరని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు.
కలెక్టరేట్ ఈ సెక్షన్ సుపరిన్డెంట్ గా పదవి విరమణ చేసిన తహసిల్దార్ ముత్యాలు ను జిల్లా అధికారులు ఘనంగా సన్మానం చేశారు . శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కలెక్టర్ ముత్యాలు తన పదవి కాలంలో నిర్వహించిన విధులు పట్ల ప్రశంసించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులను ప్రజలు ఎప్పటికీ మరచిపోరని, ఉద్యోగులు ప్రజలకు సేవ చేసే సేవాభావాన్ని అలవర్చుకోవాలని అధికారులకు సూచించారు.
పదవీ విరమణ చేసిన తహసీల్దార్ ను సన్మానము చేసిన అధికారులు
