ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తారా!
కొన్నిగుడ్లు దొరుకుతే ఇంత పని చేస్తారంటున్నా సూపర్వైజర్లు.
ప్రెస్ నోటు మాకు తెలియకుండా ఎలా ఇచ్చారంటూ సిడిపిఓ వాగ్వాదం.
ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు వేల్పుల రాజకుమార్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో నీ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మంగళవారం రోజున ఏబీవీపీ పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ఏబీవీపీస్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు వే ల్పుల రాజు కుమార్, మాట్లాడుతూ అంగన్వాడి సూపర్వైజర్లు చేసిన ఆరోపణలుసరికావని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని, విచారణ చేయవలసిన అధికారులు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని
అవినీతి ,అన్యాయాలను ప్రశ్నిస్తే అవమానించారు అంటున్న అంగన్వాడి యూనియన్ నాయకులు , సమాధానం చెప్పాలి. అని
పొరపాటు ను సరిదిద్దు కోకుండా అసత్య ఆరోపణలు అంటూ మాట్లాడటం బాధాకరం అని,వాస్తవాలు తెలుసుకోవాలిఅని మహిళా లు అంటే మాకు గౌరవం..మేం ఎక్కడ నిషేధిత పదాలు వాడలేదు.ఆరోపణలు చేస్తే విచారణ చేసి బాధ్యులను వెలికి తీయాల్సిన అధికారులు మాకు చెప్పకుండా ఎలా ప్రెస్ మీట్ పెడ్తవ్ అంటూ మాట్లాడటం ,అవినీతి నీ వెనకేసినట్టే. అన్నారు విచారణ అధికారులు ,మరియు విచారణ తేదీ నీ తెలియ జేయకుండ అధికారుల ముందు ఆధారాలు ఇవ్వలేదు అనడం హాస్యాస్పదంఅని,
యూనియన్ నాయకులు,మిగతా అంగన్వాడి టీచర్ ల సమక్షం లో ఆధారాలు ఇవ్వమనడం ఆంతర్యం ఎంటి అన్నారు, అంగన్వాడి గుడ్లు కిరాణా షాపులలో అమ్ముకుంటున్నారని ప్రెస్ నోట్ ఇస్తే సిడిపిఓ మాకు ఏమైనా చెప్పి ఇచ్చారా అంటూ బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని వాటిని ఖండిస్తున్నామని రెండు రోజులు గడిచినా కూడా వీటిపై విచారణ చేయలేని అధికారులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.మేము ఆధారాలు ఇస్తే
మి ఉద్యోగాలు కు రాజీనామాలు చేస్తారా
సమగ్ర విచారణ జరిపి
చర్యలు తీసుకోవాల్సిన చిట్యాల మండల సూపర్ వైజర్ ప్రెస్స్ కి ఎందుకు ఇచ్చావు అంటూ మా తో ఆర్గ్యుమెంట్ కి దిగడం తీవ్రంగా పరిగణిస్తున్నము
సోమవారం జరిగిన విచారణ కు ఎలాంటి నోటీస్ లు ఇవ్వకుండా మమల్ని పిలిచి 8 గ్రుడ్డు ల కే..ఇంత అని మాట్లాడిన మోగుల్లపల్లి సూపర్ వైజర్ మాటలు తీవ్రంగా పరిగణిస్తున్నము,ఇప్పటికైనా స్థానిక మరియు సిడి పీ ఓ పరిది లోని అన్ని అంగన్ వాడి కేంద్రం లో జిల్లా కలెక్టర్ ,స్థానిక ఎమ్మెల్యే తనిఖీలు చేపట్టాలి అని సమాచారం హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం
మరి కొన్ని ఆధారాలు అంద జేస్తం అని వెంటనే జిల్లా అధికారులు చొరవ తీసుకుని బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్న సిడిపిఓ మరియు చి ట్యాల మండల సూపర్ వైజర్ ల పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో విచారణ జరిపి బాధ్యులు ఎవరో బహిర్గతం చేయాలిఅని
లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ సమావేశం లో చిట్యాల నగర కార్యదర్శి శివచరన్ ,కలశాల కార్యదర్శి రాకేష్ ,సభ్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు..