
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం శుక్రవారం నాడు రాజుపేట కాలనీలో మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి గుండెకాయ లాంటి భద్రాచలం నడిబొడ్డులో ఆదివాసి చట్టాలు క్రమక్రమంగా నిర్వీరమైపోతున్నాయి తప్ప ఏమాత్రం ప్రతిష్ట చర్యలకు ముందుకు సాగడం లేదని ఆరోపించారు
తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో ప్రభుత్వ భూములను గత సంవత్సరం ఆదివాసీలు రెండుసెంట్లకోసం గుడిసెలు వేసుకుంటే రెవెన్యూరికార్డులను పరిశీలించకుండా పైగా హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా అర్ధరాత్రి పోలీసులతో వచ్చి కూల్చడం దుర్మార్గమైన చర్య గతంలో భద్రాచలం పట్టణ మొత్తం అప్పటి పిఓ గారు ప్రభుత్వ భూములను సర్వే చేయించి బోర్డులు ఏర్పాటు చేసినారు
వలస గిరినేతరులు ఆ బోర్డులను రాత్రికి రాత్రి తొలగించి LTR1/70 చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అధికారులు మీనామాసాలు లెక్కిస్తున్నారు ఆదివాసి సంఘాలు హక్కుల అమలు కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా అధికార యంత్రాంగం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు
.ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలను గౌరవించే అధికారులు ఇక్కడ పనిచేయాలని సూచించారు
.ఏజెన్సీలో చట్టాలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను వెంటనే మైదాన ప్రాంతాలకు పంపించాలని డిమాండ్ చేశారు గత ఎమ్మెల్యే గారి హయములో భద్రాచలం పట్టణంలో విపరీతంగా బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా ఆదివాసి చట్టాలకు లోబడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంగం జిల్లా కార్యదర్శి కిష్ట శ్రీనివాస్ రావు వాల్మీకి