
petrol station
పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామ పరిధిలోని కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న జియో పెట్రోల్ బంకును గురువారం అధికారులు సీజ్ చేశారు. టిజిబిపాస్ అనుమతి లేకుండా చాలా రోజుల నుండి బంకు నిర్మాణం జరుగుతుండగా నిర్మాణాన్ని ఆపాలని గ్రామపంచాయతీ మూడు సార్లు ఇచ్చిన నోటీసులను బంకు యజమానులు బేఖాతరు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీఓ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ముంజంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మలత పంచాయితీ సిబ్బందితో బంకును సీజ్ చేయించారు.