
నేటి ధాత్రి వార్త కథనంతో స్పందించిన అధికారులు
హసన్ పర్తి / నేటి ధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్ భీమారం శ్యామల చెరువులో అక్రమ కట్టడాల నేటి ధాత్రి కథనం వార్తకి ప్రతి స్పందనగా కూల్చివేస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీనివాస్, శ్రీకాంత్ వారి సిబ్బంది తదితరులు పాల్గొని అక్రమ కట్టడాలు గవర్నమెంట్ జే సీ బీ సహాయంతో అక్రమ కట్టడాలను తొలగించడం జరిగింది. గ్రామస్తులు ఆకుల కుమార్, చింత లక్ష్మన్, బూర శరత్, నాతి సమ్మయ్య, బూర రాంరాజ్, బూర రామకృష్ణ (కిట్టు), సంగాల నాగరాజు, బేతల్లి యాకయ్య, ఉప్పు ప్రభాకర్, గడ్డం భగత్, చల్ల సంతోష్, నాతి రమేష్, వల్లాల శ్రీధర్, పప్పుల రమేష్ ల సహ కారంతో ఈ శ్యామల చెరువులో కట్టడాలను కూల్చడం జరిగింది. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడుతూ మా దృష్టికి వచ్చిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులకు గ్రామస్తులు మద్దతుగా నిలుస్తున్నారు అలాగే ఎవరైనా అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కలెక్టర్ సహకారంతో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.