రెండు గ్రామాల్లో గ్రామసభ నిర్వహించిన అధికారులు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వెంకట్రావు పల్లి, నర్వ రెండు గ్రామాలలో బుధవారం రోజు ఏర్పాటుచేసిన 2024,2025 ఆర్థిక సంవత్సరంనకు సంబంధించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు జిపిడిపి రూపొందించుట కొరకు జైపూర్ మండలం లోని వెంకట్రావుపల్లి మరియు నర్వ గ్రామ పంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రామసభలో మండల గ్రామస్థాయి అధికారుల సమన్యాయంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు సదుపాయాలు కల్పనపై చర్చించి అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. నర్వ గ్రామపంచాయతీలో గ్రామ సభకు డి. వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి పాల్గొని గ్రామాలలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసి ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ నందు నమోదు చేయాలని సూచించారు. గ్రామ సభలో డి. వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి, పి. సత్యనారాయణ ఎంపీడీవో, జి. అనిల్ కుమార్ ఎం పీ ఓ, రాజ్ కుమార్ ఏ పి ఎం సేర్పు మరియు సర్పంచులు, ఉప సర్పంచ్లు మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!