Demand for Action Over Exam Paper Sealing Lapse
పదవ తరగతి ప్రశ్నాపత్రాల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం
సీలింగ్ చేసిన ఘటనలో బాధ్యులైన ఆఫీసర్లపై చర్య తీసుకోవాలి- మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
https://youtu.be/DuesHkaoMCM?si=82oykQbivkOKbBGV
కరీంనగర్ జిల్లాలో త్వరలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఇటీవల జిల్లా కలెక్టరేట్ కారిడార్ లో సీలింగ్ చేసి బాధ్యతరహిత్యం వ్యవహరించి నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ డిమాండ్ చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాల సీలింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా మచ్చ రమేష్ మాట్లాడుతూ అత్యంత పకడ్బందీగా, భద్రత మధ్య ఇతర వ్యక్తుల రాకపోకలకు అవకాశం లేకుండ ఏదైనా భవనంలో నాలుగు గోడల మధ్య నిర్వహించాల్సిన సీలింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 28న కలెక్టరేట్ కారిడార్ లో నిర్వహించడం అంటే అధికారుల నిరక్ష్యానికి నిదర్శనమని, ఈకారిడార్ ద్వారానే ఇతర శాఖల సిబ్బంది, వివిధ పనులపై కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి స్థలంలో సీలింగ్ ప్రక్రియ చేపట్టడం సంబంధిత ఆఫీసర్ల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. అటుగా వచ్చేవారు ప్రశ్నా పత్రాలను దృష్టి మరల్చి తీసుకెళ్లి పేపర్ లీకేజీకి పాల్పడే ప్రమాదముందనే విషయాన్ని మరిచి ఆఫీసర్లు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు.
ఈఘటనపై వెలుగు దినపత్రికలో మెయిన్ పేజీలో మార్చి 1న ఫొటో వార్త పబ్లిష్ అయింది. ఈవార్తకు స్పందనగా ‘స్థలాభావం కారణంగానే కారిడార్ లోకి ప్రశ్నాపత్రాలను సీలింగ్ చేశాం’ అని డీఈఓ ప్రకటించగా ప్రశ్నాపత్రాల ట్రంక్ బాక్సులను డీటీఓ కార్యాలయం లోపలే సీలింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. కారిడార్ లోనే ప్రశ్నాపత్రాలు సీలింగ్ చేసినట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయినీ విష్ణు, నాయకులు సాయి, తదితరులు పాల్గొన్నారు.
