
"Bank Locked Due to Power Cut"
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక బ్యాంకుకు తాళం వేసిన అధికారులు
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని అలంకానిపేట లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవలు కరెంటు సరఫరా లేకపోవడంతో మంగళవారం నిలిచిపోయాయి. బ్యాంకుకు వచ్చిన వినియోగదారులను లోనికి రానివ్వకుండా బ్యాంక్ అధికారులు బ్యాంకుకు తాళం వేసి బయటనే ఉంచడం హేయమైన చర్యగా వినియోగదారులు బ్యాంకు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. బ్యాంకులో కరెంటు సరఫరా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇన్వర్టర్ లేదా ఏదో ఒకటి ప్రతి బ్యాంకులో ఉంటుంది కానీ ఇక్కడ లేకపోవడం అధికారులు నిర్లక్ష్యం కాదా అని పలువురు ఖాతాదారులు ప్రశ్నించారు. కొందరు ఈ ఎం ఐ, మహిళా సంఘాల పొదుపు, రుణాలు, చివరి రోజు బ్యాంకులో చెల్లించాల్సి వస్తే వారందరూ నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బ్యాంకు వినియోగదారులు ఖాతాదారులు పత్రిక విలేకరులతో అన్నారు.