
జైపూర్, నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామ పంచాయతీ నందు మార్చి మాసములో మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీ నుండి జరుగబోయే గట్టు మల్లన్న జాతర గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. జాతర సందర్భంగా గుట్ట పైన మరియు గుట్ట క్రింద జరిగే జాతరలో భక్తులకు ఏర్పాటు చేయవలసిన వసతులు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వాహణ, త్రాగు నీటి వసతి ఏర్పాట్లు, లా అండ్ ఆర్డర్, భక్తులకు వైద్య సదుపాయం , పార్కింగ్, కొబ్బరి కాయలు వేలం, పేలాల వేలం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం హాజరైన అధికారులు గ్రామంలోని పార్కింగ్ స్థలం, స్నానవాటికల దగ్గర షవర్ల ఏర్పాటు, భక్తులు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్ల ఏర్పాటు, మరుగుదొడ్ల సదుపాయం గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ మాసం తేది:-19.02.2024 రోజున కొబ్బరి కాయలు వేలం, పార్కింగ్ వేలం, పేలాల విక్రయం కొరకు వేలం ను నిర్వహించడం జరుగుతుందని మండల పంచాయితి అధికారి తెలియజేసారు.
ఈకార్యక్రమంలో అనిల్ కుమార్ ఎం పి ఓ,
విద్యాసాగర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ డబ్ల్యూ ఎస్, ఉపేందర్ రావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ప్యాగ శ్యామల-లక్ష్మణ్ మాజీ సర్పంచ్,
డేగ నగేష్ మాజీ ఉప సర్పంచ్,
సాగే రాకేష్ పంచాయితి కార్యదర్శి మరియు వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.